దంపుడు బియ్యం గురించిన కొన్నిఆశ్చర్యకర నిజాలు
మన ఆహారాల్లో ముఖ్యమైనది బియ్యంతో వండుకునే అన్నం. ఏం తిన్నా..ఎంత రుచికరమైన పదార్దాలుతిన్నా..అన్నం తినకపోతే ఏదో వెలితిగా ఉన్నట్లు ఫీలవుతూంటారు. అంతలా మనం బియ్యానికి అలవాటు పడిపోయాం. ముఖ్యంగా తెల్లెగా, నిగనిగలాడుతూ, మెరిసిపోయే బియ్యం తో చేసిన అన్నం అంటే మరీ ఇష్టంగా తింటాం. అయితే ఈ మధ్యన బరువు తగ్గాలన్నా,షుగర్ కంట్రోలులో ఉండాలన్నా, రక్తపోటు సమస్యకీ దంపుడు బియ్యంతో పరిష్కారం వెతుక్కోమంటున్నారు వైద్యులు. ముఖ్యంగా శరీరంలోని అదనపు బరువును వదిలించుకోవాలా.. అయితే, దంపుడు బియ్యం అదే బ్రౌన్ రైస్ తినండి అంటూ శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.
అయితే దంపుడు బియ్యం తింటే సాధారణ బియ్యంతో పోలిస్తే దంపుడు బియ్యం ఆరోగ్యకరమనే విషయం తెలిసినాతినటానికి ఇబ్బంది పడుతూంటారు. కానీ … దంపుడు బియ్యం పూర్తిగా తెలిస్తే మాత్రం వదిలి పెట్టం. దంపుడు బియ్యంలో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
రోజువారీ ఆహారంలో దంపుడు బియ్యం సహా ఇతర తృణధాన్యాలకు చోటివ్వడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడుతుందని, బరువు తగ్గి చురుకుదనం పెరుగుతుందని తమ పరిశోధన తేల్చిందని టఫ్ట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. రోజువారీగా మనం ఖర్చుచేసే కాలరీలకు అదనంగా వంద కాలరీలను శరీరం వదిలించుకుంటుందని తెలిపారు. ఇక దీర్ఘకాలిక వ్యాధుల ముప్పునూ ఈ తృణధాన్యాలు తగ్గిస్తాయని వారు వివరించారు.
అలాగే దంపుడు బియ్యంలో కొలెస్ట్రాల్ అసలు ఉండదు. ఈ బియ్యం తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. దాంతో పాటు శరీర బరువు అదుపులో ఉంటుంది. ఇక పండ్లు, కూరగాయాల్లో కన్నా అత్యధిక శాతం ఫైబర్ దీంట్లోనే ఉంటుందట. రోజూ ఒక కప్పు దంపుడు బియ్యాన్ని వండుకొని తింటే శరీరంలో వృథాగా కొవ్వు, మలినాలు బయటకు విసర్జింపబడతాయి. అలాగే శరీరానికి అవసరమైన క్యాలరీలను పూర్తిగా అందిస్తుంది.
దంపుడు బియ్యంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే రక్తంలోకి ఆక్సిజన్ సరపరాను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దంపుడు బియ్యాన్ని ‘ఫవర్హౌస్’ అని అంటారు. ఎందుకంటే దీంట్లో ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే 20 శాతం మెగ్నీషియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండే న్యూట్రీన్లు ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.